అన్నమయ్య: రామాపురం మండలం గువ్వల చెరువులో ఆదివారం YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పర్యటించారు. అందరినీ పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రైతులు, ప్రజలతో మమేకమయ్యారు. పండించిన ఏ పంటలకూ గిట్టుబాటు ధరలు కూడా లేవని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏ కష్టం వచ్చినా తాము తోడుగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.