KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,450 పలికింది. శుక్రవారం మార్కెట్ యార్డుకు 16 మంది రైతులు 112 క్వింటాళ్లు విడి పత్తి విక్రయానికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ట్రేడర్స్ బహిరంగ వేలంపాట ద్వారా గరిష్ఠ ధర రూ.7,450, కనిష్ఠ ధర రూ.7,200 చెల్లించి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. పత్తి కొనుగోళ్లును మార్కెట్ కార్యదర్సి రాజు పరిశీలించారు.