ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ‘బాహుబలి’తో సంచలనం సృష్టించిన దర్శకధీరుడు.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్‌లో..
ఆర్ఆర్ఆర్ సత్తా చాటడం ఖాయమని అంటున్నారు హాలీవుడ్ ప్రముఖులు. అందుకే క్యాంపెయిన్ కోసం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు జక్కన్న. అందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నట్టుతెలుస్తోంది. రీసెంట్గా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గవర్నర్స్ అవార్డుల కార్యక్రమానికి కూడా హాజరయ్యారు రాజమౌళి. దాంతో జక్కన్న ఇండియాకు ఎప్పుడొస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది.
లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. న్యాచురల్ స్టార్ నాని కోసం రాజమౌళి రావడం పక్కా అని తెలుస్తోంది. అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపురనేనితో కలిసి నాని నిర్మించిన ‘హిట్2’ మూవీ.. డిసెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి దర్శక ధీరుడు ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం.
ఈ నెల 29న జక్కన్న ఇండియాకి తిరిగి రానున్నాడట. డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కాబట్టి.. ఈ లోపు ఈవెంట్ ప్లాన్ చేసుకోమని చెప్పాడట రాజమౌళి. నానికి రాజమౌళికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే హిట్ 2 గెస్ట్‌గా రాబోతున్నాడని చెప్పొచ్చు. ఒకవేళ రాజమౌళి ఈ ఈవెంట్‌కు వస్తే.. హిట్2 సినిమాకు భారీ హైప్ రావడం పక్కా అని చెప్పొచ్చు. అయితే ఈవెంట్ డేట్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.