SDPT: భద్రాచలం రాములోరి కళ్యాణానికి ఉపయోగించే గోటి తలంబ్రాల దీక్షను ఇవాళ ప్రజ్ఞాపూర్ సాయినగర్ కాలనీలో నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మనం వలిచే తలంబ్రాలను స్వామివారి కళ్యాణంలో వాడటం భక్తుల అదృష్టమని పేర్కొన్నారు.