AP: కోట్ల కుటుంబాలకు జీవనోపాధి చూపిన ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నీరుగార్చి తీసేసేందుకే కేంద్రం పేరు మార్చిందని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. దీన్ని PM మోదీ దత్తపుత్రుడు జగన్, BJP బానిస CM చంద్రబాబు వ్యతిరేకించకుండా వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. లబ్ధిదారులను కాంట్రాక్టర్ల కింద కూలీలుగా మార్చి, ఈ పథకమే దండగ అనుకునేలా కేంద్రం ప్రణాళిక చేస్తోందని ఆరోపించారు.