కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ సుల్తానాను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉదయం మెడికల్ షాపుల యజమానులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్, ఎంపీలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన మంత్రి, ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.