TG: హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్డులోని వైన్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మూసి ఉన్న ఓ వైన్‌షాప్‌లో తెల్లవారుజామున లోపలి నుండి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మద్యం సీసాలు, ఫర్నిచర్ ఉండటంతో మంటలు క్షణాల్లో షాపు అంతటా వ్యాపించాయి.