KDP: చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు వద్ద సీఐ బాల మద్దిలేటి శుక్రవారం వాహనదారులను హెచ్చరించారు. మైనర్లకు బైక్స్ ఇచ్చినా, మోడిఫైడ్ సైలెన్సర్లు వాడినా వెంటనే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ‘మందు తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరిగా ఉపయోగించాలని పేర్కొన్నారు.