TG: 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసిందని.. ఆ లేఖపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని మండిపడ్డారు.