NDL: జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్గా కార్తీక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించకముందు ఆయన సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో చేరి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.