AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగే ఏపీ కేబినెట్ భేటీలో రూ. 1,14,824 కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. ఇందులో రూ. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయం దేశంలోనే అతిపెద్ద FDI కానుంది. రాజ్ భవన్ నిర్మాణం(రూ.212 కోట్లు), CRDAకు నిధులు, భూ కేటాయింపులు, ఉద్యోగుల డీఏ విడుదల వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి.