HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉపఎన్నిక అయినప్పటికీ GHMC పరిధిలోని కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు కూడా ఎలాంటి అధికారిక ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు శంకుస్థాపనలు చేయరాదని HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌కు దగ్గరగా ఉండే నియోజకవర్గాల్లో కూడా రాజకీయ పార్టీలు ఎన్నికలతో సంబంధం ఉండే రాజకీయ కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు.