SKLM: ఈ నెల 11న జిల్లా సమీక్ష కమిటీ సమావేశం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.