గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా? అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ 2026 జనవరిలో పూర్తి కాబోతుందట. ఈ సినిమా తర్వాత సుకుమార్‌తో సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.