HYD: కూకట్‌పల్లిలోని సుమిత్రనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం రెండు వేర్వేరు అపార్ట్మెంట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన ఇద్దరు మహిళలను రక్షించి, కౌన్సెలింగ్ నిమిత్తం ప్రభుత్వ హోమ్‌కు తరలించారు.