KRNL: జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్‌కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.