HNK: సుబేదారిలోని MLA క్యాంప్ కార్యాలయంలో గురువారం 5 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను MLA కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 90% ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, అవినీతి లేకుండా ఎంపిక జరిగిందని తెలిపారు. అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు కేటాయిస్తామని, డబ్బులు తీసుకుంటే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.