JNG:స్టేషన్ ఘనపూర్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రత్యేక నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల పర్యవేక్షణకు ముగ్గురు ఆర్వోలను (అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు) నియమించారు. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్‌ను నియమించారు.