మేడ్చల్: వరంగల్ హైవే ఘట్కేసర్ టర్నింగ్ హెచ్పీసీఎల్ సమీపంలో నేమ్ బోర్డు ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు. నేమ్ బోర్డు విరిగిపోయి, ప్రమాదకరంగా వేలాడుతూ కనిపిస్తుంది. బలమైన ఈదురు గాలులు వేసినప్పుడు నేమ్ బోర్డ్, వాహనదారుల పై పడే అవకాశం ఉన్నట్లు పలువురు భయాందోళన వ్యక్తం చేశారు. NHAI అధికారులు వెంటనే స్పందించి, నేమ్ బోర్డు తొలగించాలని కోరారు.