JDWL: కేటీదొడ్డి మండలం మైలగడ్డ స్టేజ్ సమీపంలో గల ర్యాలంపాడు కాలువ వద్ద ప్రధాన రహదారి వర్షాల కారణంగా గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు, ప్రజల ఇబ్బందులను తొలగించారు. గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు, కేటీదొడ్డి ఎస్సై బీ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గురువారం స్వయంగా రంగంలోకి దిగారు.