ఆపరేషన్ సింధూర్‌లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకునేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేపట్టినట్లు సమాచారం. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు ప్రత్యేకంగా మహిళలను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహిళలతో బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.