ATP: గుంతకలకులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ‘సూపర్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్స్’పై విద్యార్థులకు ముగ్గులు, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. లక్ష్మయ్య ఆధ్వర్యంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీ రవిశంకర్ శర్మ, కామర్స్ ఇన్ఛార్జి డా. యు. రాఘవేంద్ర ప్రసాద్ సహా అన్ని విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.