మేడ్చల్: ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అధికారులు సమయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఒక్కోసారి 11 గంటలు దాటినప్పటికీ అధికారుల క్యాబిన్ ఖాళీగా ఉంటుందని, దీంతో సర్కిల్ కార్యాలయానికి వెళ్లి ఇంటికి వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు వాపోయారు. దీని పై డిప్యూటీ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.