WGL: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సోషల్ మీడియా విభాగానికి కన్వీనర్లను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా భద్రకాళి రమణను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కన్వీనర్ ఆకుల మనోజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.