కోనసీమ: రాయవరం మండలం కొమరిపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుళ్ల ఘటన స్థలాన్ని గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి మండపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలవాలని కోరారు.