NLR: నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్య పాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్లో నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందినట్లు ఫ్రెండ్స్ తెలిపారు.