KMR: ఆశా వర్కర్లు తమ గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించాలని ఎర్రపాడ్ వైద్యాధికారిని డాక్టర్ ఖాసిం తెలిపారు. గురువారం ఎర్ర పహాడ్ PHC పరిధిలోని ఆశలతో ఆశా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వ్యాప్తిస్తున్న తరుణంలో ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్తూ అవగాహన కల్పించాలని అన్నారు.