సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ‘వారణాసి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అలాగే, ఈ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ను నవంబర్ 14న రివీల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.