KMM: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. డిప్యూటీ సీఎం రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.