PLD: చిలకలూరిపేటలోని BSNL కార్యాలయంలో ఆధార్ అప్డేట్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సుబ్బయ్య తోట నివాసి నాయుడు శివ ఆరోపించారు. శుక్రవారం పేరు అప్డేట్ చేయించేందుకు వెళ్లగా,అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ నగదు అడిగారని ఆయన పేర్కొన్నారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివ,వెంటనే బిఎస్ఎన్ఎల్ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చారు.