WGL: నల్లబెల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఇవాళ సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మూడు రవి, ఉపాధ్యక్షుడిగా కిషోర్, గౌరవ అధ్యక్షులుగా సామల సునీల్, నితీషు ప్రధాన కార్యదర్శిగా కంకటి రమేష్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు రవి మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే నిజమైన ప్రజాప్రతినిధులని అన్నారు.