ADB: మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెబుతామని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నెరడిగొండ మండల కేంద్రానికి చెందిన జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ వారి అనుచరులతో కలిసి గురువారం బోథ్ MLA అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.