భూటాన్లో ఇవాళ తెల్లవారుజామున 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంపం భూమికి కేవలం 5 కి.మీల లోతులో వచ్చింది. లోతు తక్కువగా ఉండే ఇలాంటి భూకంపాల వల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే, కంపనాలు ఉపరితలానికి త్వరగా చేరి భవనాలు త్వరగా కూలిపోతాయి. కాగా, ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.