Mahesh Babu:సినీ తారలు యాక్ట్ చేస్తూనే వ్యాపారాలు చేస్తున్నారు. రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. నాగార్జున (Nagarjuna) తర్వాత మిగతా హీరోలు, డైరెక్టర్లు ఆ బాటలో సాగుతున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏఎంబీ మాల్ (AMB Mall) నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే టెక్స్టైల్స్ (tex tile) బిజినెస్ కూడా చేస్తున్నారు. తన భార్య నమ్రత శిరోద్కర్ పేరు మీద హోటల్ (hotel) కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడంపై ఫోకస్ చేశారు.
ఫ్యామిలీతో దుబాయ్‌లో (dubai) ఉన్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. అక్కడ కోట్లు ఖర్చు చేసి ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలిసింది. రిజిస్ట్రేషన్ పనుల కోసమే అక్కడికి వెళ్లారని సమాచారం. వెకేషన్ పేరు చెప్పి.. అక్కడ ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దుబాయ్‌లో (dubai) ప్లాట్ కొనుగోలు చేసి.. అక్కడ ఇతర వ్యాపారాలు ఏం చేస్తారోననే చర్చ జరుగుతుంది.
దుబాయ్‌లో తెలుగు వారు (telugu people) ఎక్కువగా ఉంటారు. లేబర్స్, ఎంప్లాయీస్ కూడా స్టే ఇస్తారు. ఆ క్రమంలో వారి కోసం ఏమైనా బిజినెస్ చేస్తారా..? లేదంటే ఇంటర్నేషన్ స్థాయిలో వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా అనే అంశం తెలియరాలేదు. ఇప్పటికే సినిమా, ఫుడ్ కోర్ట్, టెక్స్ టైల్స్ రంగంలో ఉన్నందున.. వాటిలో ఒకటి చేసే అవకాశం ఉందని రూమర్లు వస్తున్నాయి.
దుబాయ్‌లో మహేశ్ బాబు చేసే బిజినెస్‌కు (business) సంబంధించి క్లారిటీ రాలేదు. మరికొద్దీ రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సో అప్పటివరకు మహేశ్ దుబాయ్ బిజినెస్ గురించిన అంశం సీక్రెట్‌గా ఉండనుంది.