టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్లలో సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) కూడా ఒకటి. రామానాయుడు (D Ramanaidu) ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు నిర్మిస్తోందా? అనే సందేహం రాక మానదు. ఒకవేళ సినిమాలు (Movies) నిర్మించినా రిలీజ్‌కు మాత్రం నోచుకోవడం లేదు. అది కూడా సొంత బ్యానర్ హీరోల సినిమాలకు.. నానా తంటాలు పడుతున్నారంటే.. దగ్గుబాటి హీరోలకు ఏమైంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ (Daggubati Venkatesh) తర్వాత రానా (Rana) హీరోగా రాణిస్తున్నాడు. బాహుబలి వంటి సినిమాతో రానాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. అయినా రానా అరకొరగానే సినిమాలు చేస్తున్నాడు. సొంత బ్యానర్లో కూడా సినిమాలు చేయలేకపోతున్నాడు. చేసినా.. రిలీజ్‌కు ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నాడు. రానా లాస్ట్ ఫిల్మ్ ‘విరాట పర్వం’ సినిమా థియేటర్లోకి రావడానికి చాలా సమయాన్ని తీసుకుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అని కూడా అనుకున్నారు. ఫైనల్‌గా రిలీజ్ అయ్యింది. అయితే రానాకే కాదు.. తమ్ముడు అభిరామ్ (Daggubati Abhi Ram) పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.
అభిరామ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘అహింస’ (Ahimsa). ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తయిపోయింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతునే ఉంది. రీసెంట్గా అహింస రిలీజ్ ఎప్పుడని.. రామబాణం ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపిచంద్, తేజని అడగ్గా.. నిర్మాతల విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పాడు. దాంతో ఇప్పట్లో అహింస రిలీజ్ అవుతుందా? అనే డౌట్స్ వస్తున్నాయి. అసలు దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family) బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఒక్క మీడియం బడ్జెట్ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎందుకిలా చేస్తున్నారు? అనేది అంతు పట్టని విషయమే. అది కూడా సొంత వారసుడి సినిమాకు సురేష్ బాబు ఎందుకిలా చేస్తున్నారనేది? హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా.. దగ్గుబాటి హీరోలకు సినిమా కష్టాలు ఏంటనేది.. అర్థం కానీ విషయమే.