NZB: వర్షాకాలంలో, చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నందున్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు NZB పోలీస్ కమిషనర్ పీ.సాయి చైతన్య పట్టణంలోని 362 మంది హోంగార్డ్స్కు రెయిన్ కోట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో, చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ రెయిన్ కోట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.