ADB: నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మి వాడను సందర్శించారు. ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులు నాగుల నర్సమ్మ, సంతోష్‌ల నూతన గృహ ప్రవేశానికి ఆయన హాజరయ్యారు.