»Viral Video Of Badly Beaten Fans At Delhi Srh Vs Dc Match
Viral Video: మ్యాచ్ కోసం వెళ్లి.. ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్
ఢిల్లీ(delhi)లో నిన్న జరిగిన IPL 2023.. 40వ మ్యాచులో అభిమానుల మధ్య ఒక తీవ్రమైన ఫైట్(fight) జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచులో భాగంగా ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రతి మ్యాచ్‌కి దేశవ్యాప్తంగా స్టేడియంలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. T20 లీగ్ 2023 ఎడిషన్‌లో తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అలాంటి క్రమంలో అభిమానుల మధ్య వాదనలు, తగాదాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అచ్చం ఇలాంటి ఘటనే నిన్న IPL 2023.. 40వ మ్యాచులో భాగంగా చోటుచేసుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఢిల్లీలో నిన్న జరిగిన మ్యాచ్‌లో అభిమానుల మధ్య తీవ్రమైన ఫైట్(fight) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(social media)లో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. వీడియోలో స్టేడియం లోపల నాలుగు నుంచి ఐదు మంది ఒకరిపై ఒకరు కొట్టుకోవడం చూడవచ్చు. మరోవైపు పక్కన ఉన్న కొంతమంది అభిమానుల చేతుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జెండాలు కనిపించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వెలకమ్ టూ ఢిల్లీ, వాట్ ఏ మ్యాచ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3,600కుపైగా లైక్స్ రాగా 2 లక్షల మందికిపైగా షేర్ చేయడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన ఆటలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని జట్టు మూడవ వరుస గేమ్‌లో విజయం సాధించడంలో విఫలమైంది. హైదరాబాద్ జట్టు(SRH) చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.