»Netherland Man Is Father Of 550 Children Ban From Sperm Donation Fined 90 Lakh Rupee
Father of 550 Children : 550 మంది పిల్లలకు తండ్రి.. ఇక చేయొద్దని కోర్టు వార్నింగ్
ప్రస్తుతం లోకమంతా డబ్బుమయం. డబ్బు సంపాదించడానికి కొందరు దేనికైనా సిద్ధపడతారు. వారు చేస్తున్న పని నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా సరైనదా కాదా అని కూడా చూడరు. డబ్బు కోసం మనుషులు వింత పనులు చేసి ఇబ్బందుల్లో పడతారు.
Father of 550 Children : ప్రస్తుతం లోకమంతా డబ్బుమయం. డబ్బు(money) సంపాదించడానికి కొందరు దేనికైనా సిద్ధపడతారు. వారు చేస్తున్న పని నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా సరైనదా కాదా అని కూడా చూడరు. డబ్బు కోసం మనుషులు వింత పనులు చేసి ఇబ్బందుల్లో పడతారు. అదేవిధంగా, నెదర్లాండ్స్(netherland)లో ఒక వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికే 550 మంది పిల్లలకు తండ్రి. తాను చేపట్టిన పని కారణంగా కోర్టు(Court) అతనిపై నిషేధం విధించింది.
డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. నెదర్లాండ్స్‌లోని కోర్టు ఇటీవల 41 ఏళ్ల జోనాథన్ మేజర్(Jonathan Major)పై నిషేధం విధించింది. అంటే జోనాథన్ ఇకపై ఎక్కువ పిల్లలకు తండ్రి కాలేడు. అయితే అతను నిజంగా 550 మంది పిల్లలకు ప్రత్యక్షంగా తండ్రి కాదు.. నిజానికి జోనాథన్ స్పెర్మ్ డోనర్(Sperm Donar). అతను నెదర్లాండ్స్‌లోని అనేక క్లినిక్‌లకు స్పెర్మ్‌ను దానం చేసి చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతను ఇకపై స్పెర్మ్ దానం చేయకూడదంటూ కోర్టు నిషేధం విధించింది.
జోనాథన్ మళ్లీ ఇలా చేస్తే రూ. 90 లక్షల జరిమానా(Fine) చెల్లించాల్సి ఉంటుంది. నెదర్లాండ్ దేశ నిబంధనల ప్రకారం, ఏ పురుషుడైనా 12 మంది మహిళ(Woman)ల ద్వారా 25 మంది పిల్లలకు తండ్రయ్యే అవకాశం ఉంది. కానీ అంతకంటే ఎక్కువ మందికి వీర్యం దానం చేయకూడదు.. కానీ జోనాథన్ ఈ నియమాన్ని(Rules) ఉల్లంఘించాడు. హేగ్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిన విచారణలో, జోనాథన్ భవిష్యత్తులో తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వారికి తన గురించి అబద్ధం చెప్పాడని వెల్లడైంది. డచ్(Dutch) సొసైటీ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ మొదట 2017లో జోనాథన్ వీర్య దానం చేశాడు. కానీ అప్పటికి, జోనాథన్ నెదర్లాండ్స్‌లోని 10 క్లినిక్‌లలో స్పెర్మ్ దానం చేయడం ద్వారా 102 మంది పిల్లలకు తండ్రయ్యాడు.
జోనాథన్ నెదర్లాండ్ లో వీర్యం చేయకుండా బ్యాన్(Ban) చేశారు. అతను విదేశాలలో స్పెర్మ్ దానం చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి అనేక డచ్ ఫెర్టిలిటీ క్లినిక్(fertility Clinic)లు, డానిష్ క్లినిక్‌లు మరియు ఆన్లైన్లో వ్యక్తులను సంప్రదించడం ద్వారా స్పెర్మ్‌ను విక్రయించాడు. తల్లిదండ్రులు కాలేని జంటలకు మాత్రమే తాను సహాయం చేయాలనుకుంటున్నానని జోనాథన్ న్యాయవాది(Lawyer) కోర్టుకు తెలిపారు.