విజయవాడ(Vijayawada)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న రోగిపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. గత రాత్రి మహిళపై ఆస్పత్రిలో లైంగిక దాడికి యత్నించిన ఘటనతో తోటి రోగులు ఉలిక్కిపడ్డారు. ఆస్పత్రిలో ఉన్న అటెండర్లు ఆ కామాంధుడి దుశ్చర్యకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు(Police Case) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణ(Police Investigation)లో బాధితురాలు మచిలీపట్నంకు చెందిన నాగలక్ష్మిగా గుర్తించారు. నిందితుడు గుంటూరుకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించి కేసు నమోదు(Case File) చేశారు. ఆస్పత్రిలోనే బాధిత మహిళకు వైద్య పరీక్షలు(Health tests) చేపట్టారు. విజయవాడ ఆస్పత్రి(Vijayawada Hospital)లో గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రిలో గతంలో సామూహిక లైంగిక దాడి ఘటన కూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో ప్రభుత్వ ఆస్పత్రి(Vijayawada Hospital)లో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే ఓ వ్యక్తి మానసిక దివ్యాంగురాలైన యువతికి ఉద్యోగం ఆశ చూపి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడి ఆమెను అక్కడే వదిలి ఇంటికెళ్లిపోయాడు. మరునాడు ఆస్పత్రిలో మరో ఇద్దరు ఒప్పంద కార్మికులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గతంలో ఈ ఘటన కలకలం రేపింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటనతో మరోసారి ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు(Police Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.