తల్లిని వైద్యుడు వేధించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. విచారణ చేపట్టగా.. ఆ విచారణతో తాను అలా ప్రవర్తించలేదని వైద్యుడు తెలిపాడు. అయినా కూడా వైద్యుడికి షోకాజ్ నోటీసులు (Show Cause) జారీ చేశారు.
వైద్యం కోసం ఆస్పత్రికి (Hospital) వెళ్లగా ముఖ్యమంత్రి మాతృమూర్తికి (CM Mother) చేదు అనుభవం ఎదురైంది. ఆస్పత్రి వైద్యుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వృద్ధురాలైన ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం హిమాచల్ ప్రదేశ్ లో సంచలనం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister Office -CMO) స్పందించింది. అయితే తాను ఆ విధంగా ప్రవర్తించలేదని ఆ వైద్యుడు వివరణ ఇచ్చుకున్నాడు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఓ విచారణ కమిటీని నియమించింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్ వింద్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) తల్లి సంసార్ దేవి (Sansar Devi). ఆమె వయసు దాదాపు 90 ఏళ్లు ఉంటుంది. ఏప్రిల్ 9న కడుపునొప్పి రావడంతో ఆమె హమీర్ పూర్ జిల్లాలోని (Hamirpur District) నాదౌన్ (Nadaun) ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యుడిని సంప్రదించి సమస్య చెప్పారు. అయితే ఆ సమయంలో వైద్యుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంసార్ దేవి ఆరోపించారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి తల్లిని వైద్యుడు వేధించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. విచారణ చేపట్టగా.. ఆ విచారణతో తాను అలా ప్రవర్తించలేదని వైద్యుడు తెలిపాడు. అయినా కూడా వైద్యుడికి షోకాజ్ నోటీసులు (Show Cause) జారీ చేశారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే అగ్నిహోత్రి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సీఎంఓ ఆదేశించింది.
కాగా వైద్యుడు (Doctor) ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు. ‘నేను అసభ్యంగా ప్రవర్తించలేదు. రోగితోపాటు వచ్చిన కుటుంబసభ్యులను మాస్కులు (Mask) ధరించాలని మాత్రమే సూచించా. ఆ వృద్ధురాలు ఎవరో నాకు తెలియదు. చికిత్స అనంతరం మందులు కూడా అందించాం’ డాక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.