»2 Lakhs To The Girls Family In Ghmc Secunderabad 10 Years Girl Child Died
GHMCలో ఇద్దరిపై వేటు..బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్లోని కళాసిగూడ(Kalasiguda)లో శనివారం తెల్లవారుజామున తెరిచిన మురుగునీటి కాలువ (నాలా)లో పడి పదేళ్ల బాలిక ప్రాణం పోయింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు..
సికింద్రాబాద్లోని కళాసిగూడ(Kalasiguda)లో శనివారం ఉదయం తన ఇంటి సమీపంలోని ఓపెన్ మ్యాన్హోల్లో వికలాంగుడైన తన అన్నను కాపాడపోయి బాలిక పడి మృతి చెందింది. ఈ ఘటనపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ క్రమంలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఈ విషాదానికి కారణమైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, విచారణ నివేదికను 10 రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించాను. ఈ ఘటన నేపథ్యంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. వారిలో బేగంపేట డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్యతోపాటు వర్క్ ఇన్ స్పెక్టర్ హరికృష్ణ కూడా ఉన్నారు.
మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న మౌనిక(10) సమీపంలోని దుకాణం నుంచి పాలు తీసుకోవడానికి ఉదయం భారీ వర్షం కురిసిన తర్వాత దివ్యాంగుడైన తన అన్నతో వెళ్లిన క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
The loss of a young life in the tragic Kalasiguda Nala incident is very unfortunate. visited the family of the deceased girl and announced an ex gratia of Rs.2 lakh. I have directed officials to investigate and take action against those responsible for this tragedy & submit an… pic.twitter.com/IGP48zh8eC
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) April 29, 2023
ఇది కూడా చూడండి:Raja Singh: బీజేపీనీ వీడే ప్రసక్తే లేదు..ఇదే ఫైనల్