»Raja Singh Is Not About To Leave The Bjp Party Join To Tdp
Raja Singh: బీజేపీనీ వీడే ప్రసక్తే లేదు..ఇదే ఫైనల్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన మెంటాలిటీకి ఆ పార్టీ సూట్ కాదన్నారు. బీజేపీలోనే తాను ఉంటానని..తనపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు వేచిచూస్తానని చెప్పారు.
గోషామహల్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగుదేశం పార్టీలో (TDP) చేరబోతున్నట్లు వచ్చిన పుకార్లను ఆయన ఖండించారు. తన మెంటాలిటీకి ఆ పార్టీ సెట్ కాదని అన్నారు. అంతేకాదు హిందూ ధర్మం గురించి, ధర్మ ధర్మ సేవ చేయాలనేది తన కోరిక అని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో బీజేపీలోనే కొనసాగాలన్నదే తన అభిమతమని, పార్టీ తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకు వేచి చూస్తానని రాజా సింగ్ స్పష్టం చేశారు.
సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంగా ఉండి హిందూ ధర్మానికి మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తానని రాజా సింగ్ అన్నారు. తన రాజకీయ భావజాలం వల్ల బీజేపీ తప్ప మరే పార్టీ తనను అంగీకరించదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో తాను గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని, ఇదే తన నిర్ణయమే అంతిమమని రాజా సింగ్ స్పష్టం చేశారు.