»You Can Go 135 Km At A Cost Of Rs 20 Electric Bike
Electric bike : రూ.20 ఖర్చుతో 135 కి.మి వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్
మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయానలి ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ బైక్ (Electric bike) కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.రూ.20 ఖర్చుతో 135 కి.మి వెళ్లొచ్చు. మతిపోగొడుతున్న ఎలక్ట్రిక్ బైక్
భారత్‌లో ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ప్రజలు పెరుగుతున్న పెట్రో వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాల(EV vehicles) కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన ఎలక్ట్రిక్ బైక్(Electric bike) కావాలా అయితే ఈ మోడల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఎందుకంటే దీని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఫీచర్లు కూడా బాగున్నాయి. ఎక్కువ రేంజ్ కలిగి ఉంది.కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కాకుండా కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ వేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అందుబాటు ధరకే ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయొచ్చు. ఫీచర్లు కూడా బాగున్నాయి. బైక్ , ఎలక్ట్రిక్ టూవీలర్(Two wheeler), ఎలక్ట్రిక్ వెహికల్, ఎకోడ్రిఫ్ట్” width=”1200″ height=”1200″ /> ప్యూర్ ఈవీ అనే కంపెనీ ఎకోడ్రిఫ్ట్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను అందుబాటులో ఉంచింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ఏకంగా 135 కిలోమీటర్లు వెళ్తుంది.ఇంకా ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ టాప్ స్పీడ్ (Top speed) గంటకు 75 కిలోమీటర్లు. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99,999గా ఉంది. ఢిల్లీలో సబ్సిడీ కలుపుకుంటే ఈ రేటు ఉంది. లేదంటే ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.14,999గా ఉంది.ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న బ్యాటరీ ఫుల్ (Battery full) కావడానికి 3 గంటల వరకు టైమ్ పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో లభిస్తోంది. మీకు నచ్చిన కలర్ ఆప్షన్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయొచ్చు.ఈ బైక్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. వెనుక భాగంలో డ్రమ్ బేక్స్(Drum bakes) అమర్చారు. సింగిల్ సీటు ఉంటుంది. 5 స్పోక్ అలాయ్ వీల్స్, హెడ్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు ఈ బైక్‌ను దగ్గరిలోని షోరూమ్ వెళ్లి కొనొచ్చు. లేదంటే కంపెనీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.బైక్ రన్నింగ్ కాస్ట్ విషయానికి వస్తే.. కిలోమీటరుకు దాదాపు 24 పైసలు ఖర్చు అవుతుంది. అంటే రూ.20 ఖర్చుతో 135 కిలోమీటర్లు వెళ్లొచ్చు