»Do You Know Which Countries Give Easy Visas To India
Easy Visa: భారత్కు సులువుగా వీసాలు ఇచ్చే దేశాలు ఏంటో తెలుసా?
విదేశాలకు వెళ్లాలంటే విసా కచ్చితంగా ఉండాలన్న విషయం తెలిసిందే. అది సంపాందించాలంటే ఎంత కష్టపడాలో చూస్తూనే ఉన్నాము. కానీ భారత్కు కొన్ని దేశాలు సులువుగా విసాలు ఇస్తాయి అవేంటో తెలుసా..
Easy Visa: మన దగ్గర ప్రతిభ ఉన్న చాలా మంది విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించుకుంటారు. మేధావులు మాత్రమే కాదు కార్మికులు కూడా విదేశాల్లో కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు. అయితే వేరే కంట్రీలకు వెళ్లాలంటే పాస్ పోర్టు ఉండాలి, ఆ దేశం అనుమతి పొందాలి అంటే మనం వెళ్లాలనుకున్న దేశం విసా మంజూరు చేయాలి. అలా అయితేనే మనం సక్రమంగా వెళ్లినట్లు. అంతే కాదు విసాకు పరిమితి ఉంటుంది. అది దాటితే రిన్వల్ చేసుకొని మళ్లీ ఆ దేశాల్లో పనులు చేసుకొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి విదేశాలకు వెళ్తుంటారు. విసా కోసం వారు ఎంత కష్టపడుతుంటారో చూస్తూనే ఉంటాము.
అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తారు. వారికి విసా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. వీరే కాకుండా కొంత మంది కార్మికులు సైతం ఇతర దేశాలకు వెళ్తుంటారు. వారికి అన్ని దేశాలు విసాలు ఇవ్వవు. ఇచ్చే కొన్ని దేశాలు కూడా అంత సులువుగా ఇవ్వవు. కానీ కొన్ని కంట్రీస్ మాత్రం భారతీయులకు సులువుగా విసాలు ఇస్తాయి. అందులో మొదటిది నెదర్లాండ్స్. ఈ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. తక్కువ ట్యాక్స్ ఉంటుంది. మంచి హాస్పటల్ ఫెసిలిటీ ఉంటుంది. టెక్నికల్ రంగంలో రాణించాలని అనుకునే వారిని ఆ దేశం గౌరవంగా ఆహ్వానిస్తుంది. ఆ తరువాత స్కిల్డ్ వర్క్ విసా, గ్యారెంటీ విసాలతో భారతీయులను ఆహ్వానించే దేశం యూకే. ఇక మూడవది న్యూజీలాండ్. ఈ దేశం ఇమ్మిగ్రేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నాలుగవది సింగపూర్. తరువాత ఆస్ట్రేలియా విసా కూడా సులువుగా పొందవచ్చు.