»Priyanka Gandhi Is Not Contesting From Amethi From Where Rahul Gandhi Will Contest For The Lok Sabha
Lok Sabha Elections: ప్రియాంకగాంధీ పోటీ డౌటే.. రాహుల్‌గాంధీ స్థానం ఏది?
ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఖారారు కాలేదు. ఈ రెండు స్థానాల్లో అమేథీ నుంచి ప్రియాంక గాంధీ, రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రియాంకా విముఖత చూపినట్లు తెలుస్తుంది.
Priyanka Gandhi is not contesting from Amethi. from where Rahul Gandhi will contest for the Lok Sabha.
Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ బరిలో ఉండడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ, రాయ్‌బరేలి లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక చేసే బాధ్యత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్నారు. అయితే గత కొంత కాలంగా అమేథీ నుంచి ప్రియాంకగాంధీ, రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని వార్తలు విని పించాయి. తాజాగా ప్రియాంకగాంధీ పోటీనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక్క స్థానంలో పోటీచేయడం కన్నా దేశమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేయడమే మంచిదని, తాను పోటీ చేస్తే వారసత్వపాలన అనే అంశం ప్రత్యర్థులకు అస్త్రం అవుతుందని భావిస్తుంది.
అయితే అమేథీ నుంచి రాహుల్ గాంధీనే పోటీలో ఉంటారు అనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే రెండు స్థానాల నుంచి రాహుల్ గాంధీనే నిలబెడుతారని తెలుస్తుంది. ఆమేధీ స్థానంలో ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో ఐదవ దశలో భాగంగా మే 20 న ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మే 3 నామినేషన్లకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో నేడు లేదా రేపు ఆ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.