Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ అడవిప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోలు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సలెట్స్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి నుంచి కుంబింగ్ చేపట్టారని.. ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Encounter: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవిలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల బార్డర్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరిగిన ఈ ఎన్కౌంటర్ (Encounter)లో మొత్తం నలుగురు నక్సలేట్స్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర బార్డర్‌లోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో సోమవారం రాత్రి నుంచే ఆ ప్రాంతంలో కుంబింగ్ చేస్తున్నారని.. ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ అపరేషన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా పాల్గొన్నారు.
మావోల స్థావరానికి చేరుకున్న పోలీసుల అలికిడి గమనించి నక్సల్స్ కాల్లుపు మొదలుపెట్టినట్లు దాంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు మావోయిస్టులు హతం అయ్యారని, మిగితా వారు పారిపోయినట్లు చెప్పారు. అయితే భద్రతా సిబ్బందికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఇటీవలే జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.