»Sperm Donor Ari Nagel Biological Father Of 165 Children Viral
Ari Nagel: స్పెర్మ్ డోనర్.. 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్.. వైరల్
అమెరికాకు చెందిన అరి నాగెల్ అనే వ్యక్తి 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్గా మారాడు. గత కొన్నేళ్లుగా వీర్యదానం చేస్తున్న ఈయన త్వరలోనే వీర్యదానం చేయడం మానేస్తానని ప్రకటించాడు.
Sperm donor.. Ari Nagel, biological father of 165 children.. Viral
Ari Nagel: అమెరికాకు చెందిన అరి నాగెల్ అనే వ్యక్తి 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్గా మారాడు. గత కొన్నేళ్లుగా వీర్యదానం చేస్తున్న ఈయన త్వరలోనే వీర్యదానం చేయడం మానేస్తానని ప్రకటించాడు. వీర్యదానం గురించి గత కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం. విక్కీ డోనార్ అనే సినిమా సైతం చేశారు. 2012లో వచ్చిన ఈ సినిమాతో స్పెర్మ్ డొనేషన్ గురించి చాలా మందికి అవగాహన కలిగింది. తాజాగా మరోసారి ఈ స్పెర్మ్ డొనేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది.
అరి నాగెల్ వీర్యం దానం ఇవ్వడం ద్వారా 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు. ప్రస్తుతం తన వయసు 48 సంవత్సరాలు, మరో రెండు సంవత్సరాలు మాత్రమే తాను వీర్యం దానం చేస్తానని చెప్పేశాడు. 50 ఏళ్లు వచ్చాక స్పెర్మ్ డొనేషన్ చేస్తే.. అనేక ఇబ్బందులు తలెత్తుతాయని నాగెల్ తెలిపాడు. 50 ఏళ్ల వయస్సులో ఆటిజం వంటి రిస్కులు, సమస్యలు వచ్చేస్తుంటాయి. అంతేకాకుండా వీర్యం నాణ్యత కోల్పోతుందని ఆయన చెప్పారు. ఈయన మూలంగా జన్మించిన పిల్లలు అమెరికాలోనే కాదు .. ఆసియా, ఆఫ్రికా, కెనడా యూరోప్ దేశాల్లోనూ ఉన్నారు. ఈయన ద్వారా ప్రస్తుతం మరో పదిమంది గర్భిణులున్నారు. నాగెల్ చేస్తున్న వీర్యదానం వల్ల అనేక మందికి ఉపయోగం కలుగుతోంది. ఈ విధానం అనేక మంది మహిళలకు వరంగా మారింది.
ఇప్పుడు అండాల్ని కూడా నిల్వ చేసుకునే సదుపాయం వచ్చింది. ఓ వయసు దాటాక అండోత్పత్తి సరిగ్గా ఉండదనే భావనతో యుక్త వయసులోనే తమ అండాల్ని నిల్వ చేసుకోవాలని చాలా మంది యువతులు భావిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ మెహ్రీన్ కూడా తన అండాలను ఎగ్ బ్యాంక్లో భద్రపరిచింది.