»Preity Zinta Reveals She Once Made 120 Aloo Paranthas For Punjab Kings Players
IPL 2023 : ఆలు పరాఠాలు చేసిన ప్రీతి జింటా.. లాగించేసిన పంజాబ్ ఆటగాళ్లు
పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలైన ప్రీతీజింటా తన జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ పరాఠాలు చేయలేదని చెప్పుకొచ్చింది. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రీతి ఈ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
IPL 2023 : ఐపీఎల్ 2023లో పంజాబ్ జట్టు(Punjab Team) ఏడు మ్యాచ్‌లు ఆడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy)ని గెలవలేకపోయింది. ప్రతీ సీజన్ లోనూ జట్టు సహ యజమాని ప్రీతి జింటా(preity zinta) ప్రతి మ్యాచ్ చూసేందుకు స్టేడియాలకు వెళ్తుంటారు. తనకు సాధ్యమైనంత వరకు తన జట్టుకు మద్దతు ఇస్తుంటారు.
ఈ క్రమంలోనే ప్రీతీజింటా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అది 2009 ఐపీఎల్ సీజన్(IPL Season) లో అంటే దాదాపు 12ఏళ్ల కింద జరిగిన ఘటన. పంజాబ్ కింగ్స్(Kings XI Punjab) సహ యజమానురాలైన ప్రీతీజింటా తన జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ పరాఠాలు చేయలేదని చెప్పుకొచ్చింది. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రీతి ఈ ఆసక్తికర విషయాలను పంచుకుంది. స్టార్ స్పోర్ట్స్‌లో యాంకర్ ‘‘ప్రీతీ జింటా తన జట్టు పంజాబ్ కింగ్స్ కోసం ఆలూ పరాఠాలను తయారు చేస్తుందని ఎవరు ఊహిస్తారు? ఆ తర్వాత వారు ఆలూ పరాఠా తినడం మానేశారని నేను అనుకుంటున్నా’’ అంటూ ప్రశ్నించారు. ఇది వినగానే మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ నవ్వాడు.
అప్పడు ప్రీతి మాట్లాడుతూ ’అప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నాం. ఆటగాళ్లకు నిర్వాహకులు మంచి పరాఠాలు వడ్డించలేదు. దీంతో మీకు నేను పరాటాలు చేయడం నేర్పిస్తానన్నాను. అప్పుడు వారు తమకు పరాఠాలు చేసివ్వాలని అడిగారు. వచ్చే మ్యాచ్‌లో గెలిస్తే ఆలూ పరాఠాలు చేస్తానని వారికి మాటిచ్చాను. వాళ్లు గెలిచారు. తర్వాత నేను 120 ఆలూ పరాటాలు తయారు చేశాను. మళ్లీ ఇప్పటి వరకు ఆలూ పరాఠాలు చేయలేదు” అని ప్రీతి వివరించింది. పక్కనే ఉన్న హర్బజన్ సింగ్ .. “ఇర్ఫాన్(Irfan Pathan) ఒక్కడే ఇరవై పరాఠాలు(paranthas) తిన ఉంటాడు” అంటూ నవ్వేశాడు.
🚨 Star Sports Exclusive 🚨
Throwback to when @realpreityzinta discovered that her @PunjabKingsIPL side have an appetite for more than just winning! 🤣