ఆ పోయిన వారం సమంత ‘యశోద’.. గత వారం రిలీజ్ అయిన సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా గాలోడు సినిమాకు ఊహించని వసూళ్లు వస్తున్నాయి. అలాగే మరో సినిమా ‘మసూద’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం మరికొన్ని కొత్త సినిమలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
వాటిలో తెలుగు నుంచి అల్లరి నరేష్ రంగంలోకి దిగబోతున్నాడు. ‘నాంది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాతో.. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లరోడు. అయితే అదే రోజు.. రెండు డబ్బింగ్ సినిమాలు నరేష్‌కు గట్టిపోటీ ఇవ్వబోతున్నాయి. ఆ సినిమాలకు తెలుగులో పెద్దగా బజ్ లేకపోయినా..
అల్లు అరవింద్, దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో.. ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతోంది. బాలీవుడ్లో వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ‘భేడియా’ అనే మూవీ.. తెలుగులో ‘తోడేలు’గా విడుదల కాబోతోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక తమిళ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘లవ్ టుడే’ సినిమాను దిల్ రాజు డబ్ చేసి.. ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. దాంతో అల్లరోడి సినిమా కంటే.. ఈ సినిమాలే ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. పైగా లవ్ టుడే హిట్ మూవీ.. తోడేలు డిఫరెంట్ సబ్జెక్ట్ కావడంతో..
అల్లరోడు ఈ సినిమాలను తట్టుకొని నిలబడతాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. కానీ కంటెంట్ ఉంటే మాత్రం.. అల్లరి నరేష్‌కు తిరుగు లేదని చెప్పొచ్చు. పైగా ఈ వారం సినిమాల్లో.. తెలుగు ఆడియెన్స్‌కు నరేష్ మాత్రమే తెలుసు. కాబట్టి ఈ వారం బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారింది!